ఎయిడ్స్ వ్యాధితో జీవిస్తున్న వారికి అండగా నిలుద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎయిడ్స్ వ్యాధితో జీవిస్తున్న చిన్నారులను గుర్తించి వారికి తోడ్పాటును అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి పిలుపుమేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.