సత్యవేడు పట్టణంలోని ఇందిరానగర్లో ఎర్త్ వైర్ తగిలి గేదె మృతి
సత్యవేడు: ఎర్త్ వైర్ తగిలి గేదె మృతి సత్య వేడు పట్టణంలోని ఇందిరా నగర్లో ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ తగలడంతో ఓ గేదె దూడ మంగళవారం ఉదయం చనిపోయింది. మేత మేస్తూ అటుగా దూడ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణగా ఏమీ ఏర్పాటు చేయకపోవడంతో దూడ చనిపోయిందని స్థానికులు తెలిపారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.