చిత్తూరు వేలూరు రోడ్ లోని గోపాలపురం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యక్తిని కారు ఢీకొనడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయాడు. అటుగా వెళుతున్న స్థానికులు గుర్తించి అతనిని సముదాయించి అతని వివరాలు అడగగా వెంకటాపురం అశోక్ అని ని చెప్పాడని అతనిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.