ఈపూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ఆందోళన
యూరియా కోసం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్దకు రైతులు మహిళలు భారీగా చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అధిక సంఖ్యలో రైతులు రావడంతో సొసైటీ సిబ్బంది గోడౌన్ షట్టర్లు ముసి వేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం వచ్చిన రైతులు మహిళలు తమ ఆధార్ కార్డులను కార్యాలయ సిబ్బందికి అందజేసి యూరియా పంపిణీ చేయాలని కోరారు.