వందే భారత్ కు చెల్లించిన టిక్కెట్ డబ్బులు ఇప్పించాలని జిల్లా వినియోగదారుల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు
వందే భారత్ రైలు రద్దు కావడంతో తీసిన టిక్కెట్ డబ్బులు ఇప్పించాలని కోరుతూ పార్వతీపురం పట్టణానికి చెందిన గెంబలి రమేష్ ఆదివారము జిల్లా వినియోగదారుల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆగస్టు నెల 29వ తేదీన ఫ్యామిలీతో ప్రయాణించేందుకు 2076 రూపాయలు చెల్లించి వందే భారత్ ఆన్లైన్ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగిందన్నారు. ఆరోజు వందేభారత్ రద్దయిందన్నారు. ట్రైన్ కోసం చూసి వేరే వాహనంలో 5000 రూపాయలు వెచ్చించి ప్రయాణం చేయడం జరిగిందన్నారు. ఇంతవరకు టికెట్ డబ్బులు జమ కాలేదన్నారు. వాటిని ఇప్పించాలని కోరుతూ సంఘాన్ని ఆశ్రయించారు.