ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకరు మినీ లారీ ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేప నూనె ట్యాంకర్ కు మంటలు చెలరేగడంతో ట్యాంకర్ డ్రైవరు మంటల్లో సజీవ దహనం అయ్యాడు. మంటలను ఆర్పేందుకు స్థానికంగా ఉన్న పోలీసులు అగ్గిమాపక శాఖ అధికారులు చేరుకొని మంటలను ఆర్పి వేశారు. జరిగిన ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది..