తాడిపత్రి: ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి యూనిఫామ్ ధరించడు, డ్యూటీ చేయడు: తాడిపత్రిలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్షావలి
తాడిపత్రిలో ఏ ఎస్పీ గా పనిచేస్తున్న రోహిత్ కుమార్ చౌదరిపై తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం ధ్వజమెత్తారు.సాయంత్రం 5 గంటల సమయంలో మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ వైస్ వైస్ చైర్మన్ షేక్షావలి మీడియాతో మాట్లాడారు.ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఏ రోజు యూనిఫామ్ ధరించడు,డ్యూటీ చేయడన్నారు.ఎస్పీ ఆఫీసులో కూర్చుని టైంపాస్ చేస్తుంటాడన్నారు. అలాంటి వ్యక్తి గురించి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడితే దాన్ని వక్రీకరిస్తూ పోలీసులందరినీ విమర్శించినట్లు పోలీసు అధికారుల సంఘం నాయకులు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పే ప్రసక్తే లేదన్నారు.