తిరుమలలో సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్న దుకాణదారుడు
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా కొంతమంది అనధికారికంగా వ్యాపారాలు చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు తిరుమల షాపింగ్ కాంప్లెక్స్ లో వరుస దొంగతనాలు జరుగుతుండగా ఎట్టకేలకు యజమాని చాకచక్యంగా సీసీ కెమెరాలు ఆధారంగా పట్టుకోగలిగాడు స్థానిక భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చిన వెంటనే వారు తక్షణమే స్పందించి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు విచారణలో వారు అనధికారికంగా తిరుమలలో నివసిస్తూ భక్తుల తరహాలో దుకాణాల్లో సంచరిస్తూ వస్తువులు అపహరిస్తున్నట్లు తెలిసింది.