సూర్యాపేట: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విద్రోహ దినం పాటించాలి:PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖల్ కుమార్
సూర్యాపేట జిల్లా: సెప్టెంబర్ 17న తెలంగాణ విద్రోహ దినంగా జరపాలని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ మంగళవారం పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని లెనిన్ నగర్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాలకులు వక్రీకరిస్తే ప్రజలు క్షమించాలని అన్నారు. సెప్టెంబర్ 17న సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా తెలంగాణ విద్రోదినంగా పాటించాలని అన్నారు. నల్ల జెండాలతో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామన్నారు.