అనంతపురం జిల్లా నార్పల క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బీహార్ రాష్ట్రానికి చెందిన అరవింద్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.