నడిమి దొడ్డిలో కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Nov 13, 2025
అనంతపురం జిల్లా నార్పల మండలం నడిమి దొడ్డిలో గురువారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో కుటుంబ సమస్యలతో బాధపడుతూ నాగేంద్ర అనే వ్యక్తి ఇంటిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. నాగేంద్ర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నదని అత్యవసరవిభాగం వైద్యులు డాక్టర్ రామాంజనేయులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.