తమను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు : జెసి అనుచరులు మీడియాకు వివరాలు వెల్లడి, తీవ్ర దుమారం రేపుతున్న వ్యవహారం
Anantapur Urban, Anantapur | Oct 22, 2025
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం నిత్యం వార్తలలోకి ఎక్కుతూ ఉంటుంది. గత రెండు రోజుల నుంచి తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పి రోహిత్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో జెసి అనుచరులను పోలీసులు విచక్షణ రహితంగా చిత్రహింసలకు గురి చేశారని మీడియాకు వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.