ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పడమట బజారు యూత్ ఆధ్వర్యంలో స్లో బైకింగ్ రేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల వారు పాల్గొన్నారు. శివరామపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఈ పోటీల్లో గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు.