పులివెందుల: కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలో వ్యతిరేకత వస్తోంది : వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి వెల్లడి
Pulivendla, YSR | Sep 20, 2025 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించాలనే కూటమి ప్రభుత్వ స్వార్థపూరిత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తీవ్ర సంక్షోభం కారణంగా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంటే, ఎల్లోమీడియా దాన్ని మద్యం కేసు అంటూ, కొత్త కొత్త కథనాలతో డైవర్షన్ చేస్తోందని అన్నారు.