సంగారెడ్డి: కంది మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలు స్పార్క్ ఫెస్ట్ పోటీలు
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో కందిలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో 'స్పార్క్ ఫెస్ట్-2025' పోటీలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థులు ఈ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. మైనార్టీ గురుకులాల ఆర్సీఓ బానుమతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మైనార్టీ గురుకులాల నుంచి వచ్చిన విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ వంటి అంశాల్లో బహుమతులు అందజేశారు.