గచ్చిబౌలి ప్రాంతంలో ఓ జింక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి లింగంపల్లి ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న కారును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న హెచ్సీయూ యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ వెంటనే స్పందించి, జింకను సురక్షితంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. అటవీ సరిహద్దు రోడ్లపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.