హుజూరాబాద్: జాతీయ స్థాయి గ్రేట్ పీపుల్ మేనేజర్ అవార్డును GMI సమ్మిట్ లో ముంబై లో అందుకున్న పట్టణానికి చెందిన ఆడెపు ధీరజ్
హుజురాబాద్: పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ ఫీలింగ్ స్టేషన్ ఓనర్ ఆడేపు ధీరజ్ జాతీయ స్థాయి గ్రేట్ పీపుల్ మేనేజర్ అవార్డును ముంబైలో ఆదివారం సాయంత్రం అందుకున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. భారత దేశవ్యాప్తంగా టాప్ 100 గ్రేట్ పీపుల్ మేనేజర్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ఎంపికై జిఎంఐ సమ్మిట్ లో గ్రేట్ మేనేజర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ గ్రేట్ మేనేజర్స్ లీగ్ సమ్మిట్ 2025 ఇన్ టాటా థియేటర్ ఎన్సీపీఏ లో సర్టిఫికెట్ అందజేశారు. దేశంలోనే 100 మంది వ్యాపారవేత్తల్లో హుజురాబాద్ కు చెందిన ధీరజ్ ఎంపిక కావడం జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రం గర్వకారణం అని పలువురు కొనియాడారు.