రాయదుర్గం: పూలచర్ల గ్రామంలో గజగౌరి దేవి ఉత్సవాల సందర్భంగా ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు నిర్వాహణ
గజగౌరి ఉత్సవాలను పురష్కరించుకుని కణేకల్లు మండలంలోని పూలచర్ల గ్రామంలో శనివారం ఉదయం నుంచి మద్యాహ్నం వరకూ రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు తమ ఎద్దులతో రాతిదూలం లాగుడు పోటీల్లో పాల్గొన్నారు. నిర్దేశించిన సమయానికి 5058 అడుగులు లాగి జొన్నగిరి అద్దంకి మస్తాన్ యాదవ్ ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆత తర్వాత స్థానాల్లో గోవిందవాడ గురుస్వామి ఎద్దులు, పులికొండ మాదవరాజు నాయుడు, లింగదల్ ఎర్రిస్వామి ఎద్దులు, పెద్దకౌకుంట్ల గాలిశీనప్ప ఎద్దులు నిలిచాయి. గ్రామ పెద్దల చేతుల మీదుగా వీరికి బహుమతులు అందజేసి శాలువాలతో సత్కరించారు.