ఏలూరు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో 70 మంది దివ్యాంగులకు వివిధ రకాల పరికరాలను అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. మంగళవారం పునరావస కేంద్రాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడారు. సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వారికి అందించడం అభినందనీయమని అన్నారు. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.