ASF మండలం చిలాటిగూడ గ్రామ పంచాయతీలో ఎస్సీ కేటగిరికి చెందిన ఓటర్లు లేకున్నా ఆ కేటగిరి రిజర్వేషన్ కల్పించారు. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో ఆ గ్రామ సర్పంచి పదవికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించారు. ఆ గ్రామంలో మొత్తం బీసీ ఓటర్లు ఉండగా ఒక్క ఎస్సీ ఓటు కూడా లేదు. అక్కడ మాత్రం ఎస్సీ రిజర్వేషన్ రావడంతో గ్రామస్థులంతా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈసారి చిలాటిగూడ సర్పంచి ఎన్నిక లేనట్లే కనిపిస్తోంది.