మంత్రాలయం: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి బోసే రాజు, తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి దర్శించుకున్నారు. బుధవారం వారికి శ్రీ మఠం అధికారులు ఐపీ నరసింహమూర్తి, అనంత్ పురాణిక్ స్వాగతం పలికారు. ముందుగా మంచాలమ్మ దేవికి పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. డీఎస్పీ భార్గవి, సీఐ రామాంజులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు.