ఇల్లందకుంట: మర్రివానిపల్లి గ్రామంలో కీడు సోకిందని ఇండ్లకు తాళాలు వేసి ఊరు ఖాళీ చేసి వనభోజనాలకు వెళ్లిన గ్రామస్తులు
ఇల్లందకుంట: మండలం మర్రివానిపల్లి గ్రామం లో గత నెల రోజుల నుండి ఐదుగురు మృతి చెందారు.దీంతో తమ గ్రామం లో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయని భావించిన గ్రామస్థులు గ్రామ పురోహితున్నీ అడుగగా గ్రామం లో ఉన్న ప్రజలందరూ ఇళ్లకు తాళాలు వేసి వనభోజనాలకు వెళితే కీడు పోతుందని చెప్పడం తో గ్రామ ప్రజలు బుధవారం ఉదయం ఇళ్లకు తాళాలు వేసి వనభోజనాలకు వెళ్ళారు.తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తామని గ్రామస్తులు మీడియా కు తెలిపారు. అధికారులు మూఢనమ్మకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.