సత్తుపల్లి: పుల్లయ్య బంజరలో అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించి, బాధితులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు.అనంతరం మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వముగా కాంగ్రెస్ పార్టీ పాలనను కొనసాగిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి,తదితరులు పాల్గొన్నారు..