యాదాలంకపల్లిలో పలువురు వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేసిన మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం యాదాలంకపల్లి, మారాల, కృష్ణాపురం, పాముదుర్తి గ్రామాల్లో మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి బుధవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా యాదాలంకపల్లిలో పలువురు వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారులకు ఇంటి వద్దకే చేర్చాలని సచివాలయ కార్యదర్శి విశ్వనాథకు సూచించారు. సూపర్ సిక్స్, సూపర్ సేవింగ్స్, జీఎస్టీ తగ్గుదల గూర్చి వివరించారు. హంద్రీనీవా ద్వార ప్రతి చెరువు నింపుతామన్నారు