మనోహరాబాద్: ప్రేమ విషయంలో యువకుడు ఊరి వేసుకొని ఆత్మహత్య : ఎస్సై శివానందం
ప్రేమ విషయంలో యువకుడు ఊరి వేసుకొని ఆత్మహత్య : ఎస్సై శివానందం తూప్రాన్ పట్టణంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివానందం సోమవారం రాత్రి తెలిపారు. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన నరేశ్ చారి అలియాస్ నితిన్ 22సం కుటుంబం కొంతకాలంగా తూప్రాన్ పట్టణంలో నివాసముంటుంది. ప్రేమ విషయంలో మనస్తాపానికి గురైన నరేశ్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై తెలిపారు.