నెల్లూరులో వేస్ట్ టు కంపోస్ట్ విభాగాన్ని ప్రారంభించిన కమిషనర్ నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని పంపు హౌస్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యాలయంతో పాటు వేస్ట్ టు కంపోస్ట్ విభాగాన్ని గురువారం ప్రారంభించారు. వేస్ట్ టు కంపోస్ట్ మెషిన్ పనితీరును కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.