కురుబవాండ్లపల్లి చెరువుకు గొల్లపల్లి రిజర్వాయర్ నీరు
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లి చెరువు మరువ పారుతోంది. దీంతో గ్రామస్థులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం కురుబవాండ్లపల్లి చెరువుకు గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా అధికారులు నీటిని వదిలారు. అలాగే ఇటీవల కురిసిన వర్షానికి చెరువు నిండి మరువ పారింది. దీంతో సమీపంలోని బోరు బావుల్లో నీరు బాగా వస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. యువకులు చెరువు వద్దకు వెళ్లి ఉత్సాహంతో గడుపుతున్నారు.