ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో శనివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక వైసిపి ఇన్చార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో చేపట్టారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న పది మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలు విద్యా వైద్యం కోల్పోతారని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సేకరించిన కోటి సంతకాలతో గవర్నర్ ని కలిసి మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని వైసిపి నాయకులు తెలిపారు.