కైకలూరు దానగూడెంలో వినాయక నిమజ్జనంలో వివాదంలో బాధితులను పరామర్శించిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్
Eluru Urban, Eluru | Sep 15, 2025
ఏలూరు జిల్లా కైకలూరు దానగూడెంలో వినాయక నిమజ్జనంలో వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ సోమవారం దానగూడెంలో పర్యటించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు కుట్రపూరితంగా దాడి చేశారన్నారు. దాడికి ప్రధాన కారణమైన వారిని అరెస్ట్ చేయాలని హర్ష కుమార్ డిమాండ్ చేశారు.