పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామివారి దర్శించుకున్న చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డుడి
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వెలిసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఐపీఎస్ అధికారి తుషార్ డుడి ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ వారికి స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మూషిక మండపం వద్ద ఆలయ దుశ్యాలతో సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్, సీఐ శ్రీధర్ నాయుడు, ఎస్సై నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.