యర్రగొండపాలెం: పుచ్చకాయల పల్లి గ్రామంలో ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయల పల్లి గ్రామంలో గురువారం రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలోని వర్షపు నీరు దిగువ ప్రాంతంలో ఉన్న పుచ్చకాయ పల్లి గ్రామంలోని ఇండ్లలోకి చేరాయి. గ్రామమంతా జలదిగ్బంధం కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫారం లో ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు.