భూపాలపల్లి: బతుకమ్మ, దసరా పండుగలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
బతుకమ్మ, దసరా పండుగలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం నుండి ఈ నెల 21వ తేది నుండి అక్టోబర్ 2వ తేది వరకు జరుగనున్న బతుకమ్మ, దసరా సంబురాలపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, విద్యుత్తు, ఇరిగేషన్, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్, తహసీల్దార్లు,ఎంపీడీఓలు, ఎంపిఓలు, జిల్లా అధికారులతో ఐడిఓసి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.