శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని లక్కసానిపల్లి గ్రామంలో నారాయణప్ప అనే వృద్ధుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో అతనిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.