ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీస్ స్టేషన్ సమీపంలో హైవేపై జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. సోమవారం రాత్రి విజయవాడ వైపు కాలినడన వెళుతున్న భవానీలను అదే మార్గంలో వెళుతున్న ద్విచక్రవాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈదుర్ఘటనలో బైకు మీద ప్రయాణిస్తున్న వెంకటరమణ బైకు పై నుంచి బలంగా రోడ్డుపై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ముగ్గురు భవానీ యాత్రీకులు స్వల్పంగా గాయపడ్డారు. కైకరానికి చెందిన వెంకటరమణ ఓహాటల్లో సహాకులుగా పనిచేస్తుంది.