మంచిర్యాల పట్టణంలోని బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆదివారం ఉదయం తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మాజీ ఉప రాష్ట్రపతి జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత జాతి ఉద్ధరణకు పాటుపడిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.