మహదేవ్పూర్: కాటారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆందోళన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు.మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటిముందు బైఠాయించి,ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిరసన ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు.. కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి లో బిఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో, ధర్నా. పుట్ట మదు ఇంటిని ముట్టడించి, దాడులు చేయడం సరైన సంస్కారం కాదని మండిపడ్డారు.. మంథని నియోజకవర్గంలో మహనీయుల విగ్రహాలు పెడితే జీర్ణించుకోవడంలేదని అన్నారు. తక్షణమే పుట్ట మధు ఇంటిపై దాడికి దిగిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..