సర్వేపల్లి: ఉద్యోగం ఇప్పిస్తానని 45 లక్షలు తీసుకున్నాడు : SP కి దర్గామిట్టకి చెందిన బాధితులు ఫిర్యాదు
డెన్మార్క్ లో ఉద్యోగం ఇప్పిస్తానని కొల్లూరు సుధాకర్ అనే వ్యక్తి 45 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ దర్గా మిట్టకు చెందిన ఓ బాధితుడు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా.. ఉద్యోగం ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అవేదన వ్యక్తం చేశారు..విచారించి న్యాయం చేయాలని కోరారు. దీనిపై నెల్లూరు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం మధ్యాహ్నం బాధితుడు ఎస్పీని కలిశారు.