భూపాలపల్లి: గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు పర్యటించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. కొప్పుల, కాట్రపల్లి గ్రామాల్లో కోటి 44 లక్షల రూపాయలతో బీటీ రోడ్లు, బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తామని, నియోజకవర్గ వ్యాప్తంగా 57 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలు అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర.