ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మేడేపి గ్రామంలో షేక్ రజాక్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న వంట వస్తువులు ఫ్రిడ్జ్ బట్టలు నిత్యవసర సరుకులు దగ్ధమైపోయే. ఆపరేషన్ కోసం తెచ్చుకున్న లక్షా 50 వేల రూపాయలు నగదు కూడా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.