ఇబ్రహీంపట్నం: పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం, ఇద్దరికీ తీవ్ర గాయాలు
పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జలపల్లి గేట్ సమీపంలోని అర్బన్ ఫారెస్ట్ పార్కు దగ్గర ఇద్దరు యువకులు బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి కింద పడిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.