హత్నూర: దౌల్తాబాద్ లోని మొబైల్ షాప్ హార్డ్వేర్ షాప్ లో చోరీ, ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
మొబైల్ షాప్ హార్డ్వేర్ షాప్ లో చోరీ జరిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ లో గురువారం వెలుగు చూసింది. బుధవారం రాత్రి దౌల్తాబాద్ లోని రెండు షాపులలో చోరీ జరిగినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. దౌల్తాబాద్ పట్టణంలో తరచు చోరీలు జరగడం పట్ల సానికులు వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. గట్టినిగా ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.