అవుకు కూరగాయల మార్కెట్ రహదారులో రాకపోకలకు తీవ్ర అంతరాయం
నంద్యాల జిల్లా అవుకులోని మార్కెట్ వద్ద వాహనాల రాకపోకలు సాగించాలంటే కత్తిమీద సాముగా మారింది.బుధవారం అవుకులో కూరగాయల మార్కెట్ నిర్వహించగా ఆ ప్రాంతంలో వాహనాలను నిలుపుటకు సరైన స్థలం లేకపోవడంతో రోడ్లపై ఇరువైపులా అధిక సంఖ్యలో వాహనాలను పార్కింగ్ చేశారు. దంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి మార్కెట్ కి వచ్చే వాహనదారులకు సరైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.