పీలేరు మార్కెట్ యాడ్ చైర్మన్ పురం రామమూర్తిని ఆంధ్రప్రదేశ్ హస్తకళ డెవలప్మెంట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్కెట్ యార్డు కు విచ్చేసిన రాష్ట్ర హస్తకళ డెవలప్మెంట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ను, పీలేరు మార్కెట్ యార్డు చైర్మన్ పురం రామ్మూర్తి తో పాటు, డైరెక్టర్ రవి,జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బెజవాడ దినేష్, తదితర కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కూటమి శ్రేణులు హస్తకళా చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్ తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తిని,జనసేన ఇంచార్జి బెజవాడ దినేష్ కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు