రాయదుర్గం: వడ్రహొన్నూరు గ్రామంలో పశువులలో వచ్చే గర్భకోశ వ్యాదులపై వైద్య శిబిరం నిర్వహించిన పశువైద్యులు
రాయదుర్గం మండలంలోని వడ్రహొన్నూరు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులలో వచ్చే గర్భకోశ వ్యాదులపై ఉచిత చికిత్స శిభిరం నిర్వహించారు. గురువారం ఉదయం ఈ శిభిరాన్ని పశుసంవర్ధక శాఖ ఏడిఏ వెంకటే ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల రైతులకు చెందిన పశువులకు చికిత్సలు అందించి అవసరమైన ఇంజక్షన్ లు వేశారు. రైతులు తమ పాడిపశువులకు సంక్రమించే వ్యాదుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాయదుర్గం డివిజన్ పశువైద్యాధికారి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి అరుణ్ కుమార్, సర్పంచ్ అశోక్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ప్రకాష్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.