అలంపూర్: స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం -బీజేపీ
పాలకమండలి లేకపోవడంతో ఐజ మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు అనంతరం వారు సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని వారు అన్నారు.