పీసీపల్లి మండలంలో శుక్రవారం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామితో పాటు ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ రాజాబాబు హాజరయ్యారు. భూ సర్వే ద్వారా లబ్ధిదారుల రైతులను గుర్తించి పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసి పాసు పుస్తకాలపై రాజముద్రతో రైతులకు అందించినట్లు మంత్రి స్వామి ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.