అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను రాజాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని బుధవారం రాత్రి 10 గంటలకు సమాచారం రావడంతో, డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ట్రాక్టర్లు సీజ్ చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్ ను రాజాం పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. రాజాం పోలీసులకు అప్పగించినట్లు సిఐ శ్రీధర్ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు