యాగంటి క్షేత్రంలో వైభవంగా స్వామి అమ్మవారికి పల్లకి సేవ
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామి అమ్మవార్ల పల్లకి సేవ సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు ఆలయ ఈవో పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద పండితులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పల్లకిలో కొలువు తీర్చి మాడవీధుల యందు వైభవంగా భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాగంటి పల్లె మౌళేశ్వర్ రెడ్డి పాతపాడు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి ఆలయ సిబ్బంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు