కదిరి మండలంలోని చిగురుమాను తండా, చెవిటితాండాలలో రచ్చబండ కార్యక్రమం
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండల పరిధిలోని చిగురుమాను తండా చెవిటి తండాలలో కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ఆధ్వర్యంలో బుధవారం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నతమైన వైద్య విద్యను దూరం చేస్తుందని మండిపడ్డారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.