మంగళగిరి: తప్పిపోయిన మహిళ ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించిన మంగళగిరి రూరల్ పోలీసులు
జిల్లాలోని తాడేపల్లి మండలం, కంతేరు గ్రామానికి చెందిన కట్టా శ్రీ లక్ష్మీ అనే మహిళ కురగల్లు గ్రామం నుండి భర్తతో ఘర్షణ జరిగి బయలుదేరిన తన (23) సంవత్సరాల కుమార్తె తోకల తిరుపతమ్మ ఆమె ఇద్దరు పిల్లలు (5) సంవత్సరాల మోక్ష శ్రీనాధ్, (3) సంవత్సరాల స్నేహ శ్రీ కనిపించడం లేదని 2023 సంవత్సరం, ఏప్రిల్ నెలలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుండి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.